Ms
Ms

Ms

      |      

Prenumeranter

   Senaste videorna

Ms
10 Visningar · 5 dagar sedan

⁣ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. ఎస్. బతైయ్య నాయుడు;
ఈరోజు శ్రీకాళహస్తి మండలంలోని గోపాలకృష్ణ పురం, ఉడవలపాడు, ముద్దముడి, ముచ్చివేలి, మంగళ పూరి, తదితర గ్రామాల్లో పర్యటించి మోదీ గారి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలన్నిటిని వివరిస్తూ అందులో మొన్నటి రోజున పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని మార్పు చేసి ప్రతిపక్షాలు గగోలు పెట్టిన లెక్క చేయకుండా పార్లమెంటులో జిరాంజీ బిల్లును పాస్ చేయించి రాష్ట్రపతి దగ్గర సంతకం కూడా ఆగమేఘాలలో చేయించుకోవడం జరిగింది.

మోదీ గారు ఉపన్యాసాలు వాస్తవాలకు విరుద్ధంగా కోటలు దాటుతాయని, కార్యాచనాల్లో పేద ,బడుగు ,బలహీన వర్గాలకు జరిగేది శూన్యమని.
అక్కడ ప్రజలకు హామీ పథకాని ఎందుకు మార్చారు దాని వెనక ఆ పథకాన్ని నీరుగారిచే దిశలో ముందుకు పోతున్నారని దీనిని గురించి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పిలుపుమేరకు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ .ఎస్. బతైయ్య నాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని అన్ని మండలాలను తిరిగి దీనిలోని ఉన్నటువంటి నుసుగులను బయటపెడుతూ నియోజకవర్గ ప్రజలకు మోడీ గారి జిమిక్కులను తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు నిన్నటి నుండి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.


ఈ కార్యక్రమంలో; తిరుపతి జిల్లా వ్యవసాయ కమిటీ చైర్మన్: జనార్దన్ రెడ్డి, వెంకట ముని,గోపి, శివయ్య, నాగూర్ అయ్యా, గురవయ్య, పెంచులమ్మ, బత్తెమ్మ, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Ms
29 Visningar · 9 dagar sedan

శ్రీకాళహస్తిలో 74 వ డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

Ms
28 Visningar · 12 dagar sedan

⁣*అంగన్వాడి పాఠశాలకు కుర్చీలు, పిల్లలకు పలకలు, బలపం ప్యాకెట్లు వితరణ చేసిన జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం*
శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధిలోని అంగనవాడి పాఠశాలకు జన సైనికుడు *గోపి ఆధ్వర్యంలో* కుర్చీలు, పిల్లలకు పలకలు, బలపం ప్యాకెట్లు, వితరణ చేయడం జరిగింది, మరియు పిల్లలకు మంచిక్రమశిక్షణ, మంచి వాతావరణం, విద్యను అందిస్తున్న టీచర్లకు అభినందనలు తెలిపిన జనసేన పార్టీ నాయకులు,
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గోపి, డాక్టర్ నక్కా ప్రసాద్, మనీ, నవీన్, మహర్షి రెడ్డి, చందు, పసల ఎలిసా, సాయి, లోకేష్, మళ్లీ, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Ms
6 Visningar · 16 dagar sedan

శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు

Ms
29 Visningar · 22 dagar sedan

⁣ఎపిఎన్ జిజిఓ అసోసియేసన్ తిరుపతి ఉద్యోగుల ఐక్యత వర్థిల్లాలి,అలుపెరగని శ్రామికుడు...ఉద్యోగుల ఆశాజ్యోతి...

Ms
54 Visningar · 23 dagar sedan

⁣తిరుపతి జిల్లా
శ్రీకాళహస్తి


దక్షిణకాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం నందు ప్రతియేట శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వారు సంప్రదాయబద్ధంగా ఎంతో వైభవంగా రెండు పర్యాయములు సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు ఒకసారి, శివరాత్రి సమయంలో రొండోసారి గిరి ప్రదక్షణ నిర్వహిస్తారు మోతగాళ్ళచే స్వామి అమ్మవార్లను మోసుకుని గిరి ప్రదక్షణ చేస్తారు ఆ ఆదిదంపతులవెంట కొన్ని వేలసంఖ్యలో భక్త జనం గిరి ప్రదక్షణకు వెళుతుంటారు ఇదివరకు పిచ్చాటూరు మార్గంగుండా తారు రోడ్డు మీదుగా స్వామి అమ్మవార్లు భక్తులు గిరి ప్రదక్షణ చేసేవారు ఆ మార్గం గుండా వాహనాలు రాక పోకలు ఎక్కువగా ఉండడం, ప్రమాదాలు జరగడం వంటి వాటిని ద్రుష్టి లో ఉంచుకొని గిరి ప్రదక్షణకు వెళ్ళే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు కొండలను ఆనుకొని కొన్ని కోట్లు ఖర్చు చేసి రహదారిని నిర్మించడం జరిగింది కానీ ఈ మార్గంగుండా గిరి ప్రదక్షణ సమయంలో ఎక్కువ సంఖ్యలో వాహనాలు రావడం,ఆకతాయిలు, అల్లరిమూకాలు అధిక శబ్దంతో హారన్స్ కొడుతూ అతి వేగంతో బైక్స్ నడుపుతూ నడిచివేల్లే భక్తులను ఇబ్బంది పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఈ కారణం చేత కార్లు,బైక్స్,ఆటోలు వంటి వాహనాలను దేవస్థానం వారు గిరి ప్రదక్షణ కొరకు నిర్మించిన మార్గం గుండా అనుమతించకుండా పిచ్చాటూరు మార్గం తారు రోడ్డు మీదుగా ఆ వాహనాలను గిరి ప్రదక్షణ రోజు మర్లించాలని కోరుతూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ హిందూ ధార్మిక మండలి కన్వీనర్ గరికపాటి రమేష్ బాబు వారి మిత్ర బృందంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఈ.ఓ బాపి రెడ్డి, ధర్మకర్తలమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ ,ధర్మకర్తల మండలి సభ్యులు కోలా విశాలాక్షి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై వారు సానుకూలంగా స్పందిస్తూ రహదారిని పరిశీలించి తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటామని అవరమైతే రమేష్ బాబు సహాయంకుడా తీసుకుంటామని ఇటువంట మంచి సలహాలు సూచనలు తమకు ఎల్లవేళల అందించాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.


ఈకార్యక్రమంలో గరికిపాటి రమేష్ బాబు, చిలకా రంగయ్య, గోపాలయ్యా,కన్నా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Ms
3 Visningar · 26 dagar sedan

⁣తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మున్సిపాలిటీలో కమిషనర్ TPO శారద మొత్తం వసూల్ మాయం కావడంతో శ్రీకాళహస్తిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు దీనిపై ఎంక్వయిరీ చేసి జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా శ్రీకాళహస్తి ప్రజలు కోరుతున్నారు. వీరిపై ఇంకా అదనపు కేసులు బనాయించాలని సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలని మన యోగానంద కోరుతున్నారు

Ms
6 Visningar · 29 dagar sedan

⁣సైదాపురం ను నెల్లూరు జిల్లా లో కొనసాగింపు కోసం నాలుగోరోజు సైదాపురం మండలం బంద్ విజయవంతం


సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లా లో కొనసాగించాలని కోరుతూ సైదాపురం మండలం కేంద్రం లో నిరసన దీక్షలు నాలుగో రోజు చేరుకున్న సందర్భంగా జె ఏ సి యిచ్చిన పిలుపు తో శుక్రవారం వ్యాపారాలు , స్కూల్ లు, జూనియర్ కాలేజ్ మూత పడింది.ప్రజలు స్వచ్ఛందంగా సైదాపురం ను నెల్లూరు జిల్లా లో ఉంచాలని ముందుకొచ్చి బంద్ ను పాటించారు. దీంతో సైదాపురం లో బంద్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జె ఏ సి సభ్యులు పూలే టీచర్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు తుమ్మా రవి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ నాటి ప్రభుత్వం నుండి నేటి ప్రభుత్వం వరకు జరుగుతూనే వుందన్నారు. ప్రజల అభిప్రాయం లేకుండా ఏకపక్షంగా మంత్రుల కమిటి నీ తీసుకొచ్చి సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను 40 కిలోమీటర్ల కు దూరం లో వున్న నెల్లూరు జిల్లా కేంద్రాన్ని దూరం చేసి 160 కిలోమీటర్ల దూరం లో వున్న తిరుపతి లో కలిపే విధంగా దుర్మార్గం గా ప్రకటించిందని దాన్ని వెంటనే వెనక్కి తీసుకుని మూడు మండలాలను నెల్లూరు జిల్లా లో కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. జె ఏ సి కో కన్వీనర్ షఫీ హరన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మంత్రుల కమిటి పేరుతో అక్రమ నివేదికలు తెప్పించి మూడు మండలాలను తిరుపతి లో కలపాలన్న ప్రతిపాదనను ప్రజలు ఈ ప్రభుత్వం తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మండి పడ్డారు. ప్రజలు మూడు మండల లను కలిపే ప్రతి పాదనను వెనక్కి తీసుకోకుంటే వచ్చే ఎన్నికల్లో గుణ పాఠం తప్పదని గుర్తించాలని హెచ్చరించారు. మాదిగ దండోరా మండల నాయకులు గంగాధర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వం మూడు మండలాలను తీసి తిరుపతి లో కలిపే ప్రతి పాదన తీసుకు రావటం పట్ల ప్రజలు ఆందోళన ఆగ్రహంవ్యక్తంచేస్తున్నారన్నారు. అప్రతిపాదన ను విరమించుకుని నెల్లూరు జిల్లా
లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. జె ఏ సి మండలం కన్వీనర్ డి పి పోలయ్య మాట్లాడుతూ బడా కార్పొరేట్ శక్తులు ధనార్జన కోసం ప్రజల అభిప్రాయం లేకుండా తిరుపతి జిల్లా లో మూడు మండలాలను కలుపుకోవాలని మంత్రుల కమిటి తో చీకటి ప్రతిపాదనను తీసుకురావడం ప్రజల్లో నెల్లూరు జిల్లా లో మూడు మండలాలను కొనసాగించాలని డిమాండ్ తో పోరాటాలకు సచ్చందంగా ముందుకు వస్తున్నారన్నారు.ప్రజలు కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగలు ప్రశాంతం గా సంతోషం గా జరుపుకోవా లాంటే నెల్లూరు జిల్లా లో సైదాపురం రాపూరు కలువాయి లను యథావిధి గా నెల్లూరు లో కొనసాగించాలిలేదా గూడూరు ను జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పూలే టీచర్ ఫెడరేషన్ నాయకులు జి వి రత్నం, బి ప్రసాద్, యుటి ఎఫ్ నాయకులు పి సోమయ్య, ఆర్ వి రమణయ్య, బి జె ఏ నాయకులు వి రఘు రామ్, టి చిట్టి బాబు, కె పరంధామయ్య, ఏ పి టి ఎఫ్ నాయకులు కె రవి, ఎన్ వెంకటేశ్వర వర్మ, ఎస్ డి షరీఫ్ బాబు, ఎం చిరంజీవి,ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు కె చంగల్ రావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం అనిల్ ,తదితరులు పాల్గొన్నారు.

Ms
17 Visningar · 30 dagar sedan

⁣డిసెంబర్ 10వ తేదీన నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు అడ్వకేట్ డాక్టర్ ఎంఆర్ అన్సారి గారు భారత గౌరవ అవార్డును నన్ను ఎంపిక చేసి ఆహ్వానం అందించడం జరిగినది కానీ నేను నా ఆరోగ్య సమస్య వల్ల ఔరంగాబాద్ ప్రోగ్రాంకు వెళ్లలేకపోయినాను అయినా సరే సంస్థ వారు నా యొక్క సీనియార్టీ మరియు కార్యక్రమాల సేవల్ని గుర్తించి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ షేక్ షాజహాన్ సాబ్ గారి సలహాలతో రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ గారి చేతుల మీదగా భారత గౌరవ అవార్డు ను అందించడం జరిగినది నేషనల్ సంస్థ వారికి రాష్ట్ర సంస్థ వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలపడం జరిగినది అబ్దుల్ కలాం మాట్లాడుతూ మన తిరుపతి జిల్లా ప్రజలకు మరియు శ్రీకాళహస్తి ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క హక్కులను వారికి తీసి ఇవ్వడంలో వెనకాడరు అని తెలపడం జరిగినది


తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ కలాం

Ms
15 Visningar · 1 månad sedan

⁣సైదాపురం ను నెల్లూరు జిల్లా లోనే కొనసాగాలి లేదా గూడూరు ను జిల్లా చేయాలి - జె ఏ సి కన్వీనర్ డి పి పోలయ్య


యాంకర్ పార్ట్ :- సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ లేకపోతే గూడూరు ను జిల్లా చేయాలని సైదాపురం మండలం లో నెల్లూరు జిల్లా లో మూడు మండలాల కొనసాగింపు కు జె ఏ సి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది . ఈ దీక్షకు భవన నిర్మాణ కార్మిక సంఘం ఎం ఎస్ ఎఫ్ సంఘాలు మద్దతు ను తెలిపాయి.


వాయిస్ ఓ వర్.. .సైదాపురం మండలాన్ని తిరుపతి జిల్లా లో కలప వద్దంటూ రెండో రోజు కు దీక్షలు చేరుకున్నాయి.ప్రజలు సైదాపురం మండలం ను నెల్లూరు జిల్లా లో కొనసాగించాలంటు
జరుగుతున్న దీక్షలకు స్వచ్ఛందంగా మద్దతుగా దీక్షలో కూర్చుంటున్నారు. ఈ సందర్భంగా దీక్షకు సంఘీభావం తెలిపిన సంఘాల నేతలు ఎం అనిల్ ,ఆత్మకూరు పెంచలయ్య లకు ఆహ్వానించి నల్ల కండువాలు ను కప్పి దీక్షకు ఆహ్వానించారు..అనంతరం జే ఏ సి కన్వీనర్ డి పి పోలయ్య మాట్లాడుతూ సైదాపురం మండలానికి చారిత్రకంగా, పరిపాలనా పరంగా, సామాజికంగా నెల్లూరు జిల్లాతోనే బలమైన అనుబంధం ఉందని, ప్రజల అభిప్రాయాలను పక్కనపెట్టి కూటమి ప్రభుత్వం లో విభజన కమిటీ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని హెచ్చరించారు,లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామనిహెచ్చరించారు.అనంతరం జే ఏ సి సభ్యులు జి వి రత్నం షఫీ లు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కేంద్రంతోనే ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, రవాణా సౌకర్యాలు అనుకూలంగా ఉన్నాయని, మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని . ప్రజాస్వామ్య పద్ధతిలో మండల ప్రజల అభిప్రాయాలను కూటమి ప్రభుత్వం గౌరవించి మండలాన్ని నెల్లూరు జిల్లా లోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జేఏసీ కోకన్వీనర్ ఎన్ గంగాధర్,ఎస్ కెషఫీహరన్ , పూలే టీచర్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మా రవి,ప్రధాన కార్యదర్శి జి వి రత్నం,ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు కె చంగల్ రావు, ఏ పి యు టి ఎఫ్ మండల సహాయ అధ్యక్షులు ఎం యుగంధర్,యూత్ నాయకులు ఎం పవన్ కుమార్ ,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అనిల్,ఎం ఎస్ ఎఫ్ మండల అధ్యక్షులు ఆత్మకూరు పెంచలయ్య ,మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు .

Ms
7 Visningar · 1 månad sedan

*భారతదేశ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం*
మన భారతదేశ స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది గొప్ప చరిత్ర, ఆయన భారతదేశ తొలి ఉప ప్రధాని గా, హోం మంత్రిగా, దాదాపు 500 సంస్థానాలను మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనదేశంలో విలీనం చేయడంలో ఎంతో గొప్ప కృషి చేశారు, అందుకే పటేల్ గారికి *ఉక్కుమనిషి* అనే బిరుదు ఇవ్వడం కూడా జరిగింది, మరొక స్వాతంత్ర సమరయోధులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్ర ఉద్యమంలోనూ, మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలు అర్పించి మనకు ఆంధ్ర రాష్ట్రం అవతరించడంలో ముఖ్యమైనటువంటి గొప్ప మనిషి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు , ఈరోజు వీరిద్దరి వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం లో జనసేన పార్టీ తరఫున నివాళులర్పించడం ఒక గొప్ప విషయమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, ప్రదీప్ కుమార్, నవీన్, లక్ష్మణ్, మహర్షి రెడ్డి, భాను ప్రకాష్, హరి, ముని చంద్ర, రమేష్ బాబు, చందు, గోపి
*వీర మహిళలు పేట శారద, నారాయణ గాయత్రి తదితరులు పాల్గొన్నారు*
.

Ms
4 Visningar · 1 månad sedan

అంధ క్రికెటర్ల జట్టు కెప్టెన్ దీపిక, సభ్యురాలు పాంగి కరుణ కుమారి కుటుంబాలకు టీవీ, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ Pawan Kalyan గారు..

#PawanKalyanAneNenu

Ms
10 Visningar · 1 månad sedan

⁣*శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమము*
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 70 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమమును పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మహేష్, భాను ప్రకాష్,నవీన్, ప్రదీప్ కుమార్, పసల సురేష్,లక్ష్మణ్, మహర్షి, మనీ, పసల ఎలిసా, కళ్లిపూడి వెంకటేష్, రాజా, చందు, సాయి,
వీర మహిళలు పేట శారద, నారాయణ గాయత్రి, బత్తెమ్మ,పద్మ ,తదితరులు పాల్గొన్నారు.

Ms
6 Visningar · 1 månad sedan

శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి ప్రజలందరికీ 7 గంగమ్మల జాతర శుభాకాంక్షలు తెలిపారు

Visa mer